Friday, December 20, 2024

త్వరలో టిపిసిసి కీలక నాయకులు, అభ్యర్థులతో సునీల్ కనుగోలు ప్రత్యేక మీటింగ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా అడుగులు వేసిందని, ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తున్నట్లు ఆ పార్టీ స్ట్రాటజిస్టు సునీల్ కనుగోలు పేర్కొన్నారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, అన్ని నియోజకవర్గాల అభ్యర్ధులు, కార్యకర్తలకు సునీల్ కనుగోలు శుభాకాంక్షలు తెలిపారు. గాంధీభవన్‌లోని వార్ రూమ్ నుంచి సునీల్ శుభాకాంక్షలు తెలుపుతూ అభ్యర్థులకు మెస్సేజ్ చేశారు.

ప్రజాస్వామ్యం కాపాడేందుకు అందరూ శ్రమించి ఒడ్డెక్కారని ఆయన అభినందనలు తెలిపారు. దేశమంతటా ఇక కాంగ్రెస్ వేవ్ రావడం ఖాయమంటూ అభ్యర్థులకు తన సందేశాన్ని పంపించారు. అయితే అతి త్వరలో టిపిసిసి కీలక నాయకులు, అభ్యర్థులతో సునీల్ కనుగోలు ప్రత్యేక మీటింగ్‌ను ఏర్పాటు చేయను న్నారు. ఈ మీటింగ్ గాంధీభవన్ లేదా ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్‌ను పెంచడంలో సునీల్ కీలకంగా వ్యవహరించారు. టిక్కెట్ల ఎంపిక దగ్గరి నుంచి ప్రచారం, ఏఐసిసి అగ్రనాయకుల పర్యటన లను ఆయన ఫిక్స్ చేశారు. పోలింగ్‌లోనూ సునీల్ ఆశించిన ఫలితాలే రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. దీంతో అన్ని నియోజకవర్గాల అభ్యర్థులతో సునీల్ కనుగోలు ముఖాముఖీ నిర్వహించనున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News