Wednesday, January 22, 2025

క్రికెట్‌కు సునీల్ నరైన్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

దుబాయ్: వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ సునీల్ నరైన్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించాడు. ‘వెస్టిండీస్‌కు నా శక్తిమేరకు సేవలు అందించినందుకు చాలా గర్వంగా ఉంది. నా కెరీర్‌లో నాకు సహకారం అందించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు, కోచ్, అభిమానులకు ధన్యవాదాలు’ అంటూ పేర్కొన్నాడు.

నరైన్ అంతర్జాతీయంగా 65 వన్డే, 51 టి20, 6 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్‌లలో కలిపి 165 వికెట్లు పడగొట్టాడు. 2012లో టి20 ప్రపంచకప్ గెలిచిన విండీస్ జట్టులో నరైన్ భ్యుడు. నరైన్ చివరగా విండీస్ తరపున 2019లో టి20లో ఆడాడు. ఇక చివరి టెస్టు 2013లో ఆడగా.. 2016లో ఆడిన వన్డే మ్యాచ్ చివరిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News