Monday, December 23, 2024

సింగరేణి సిఎండిగా సునీల్ శర్మ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ ఛైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సునీల్ శర్మను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సునీల్ శర్మ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ, రోడ్లు భవనాలశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఎన్‌ఎండిసి చైర్మన్‌గా నడిమెట్ల శ్రీధర్

నేషనల్ మినరల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎండిసి) చైర్మన్‌గా నడిమెట్ల శ్రీధర్ నియామకమయ్యారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రై నింగ్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజేస్ సెలక్షన్ బోర్డు ఎన్‌ఎండిసీ చైర్మన్‌గా నియమించాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన సింగరేణి సిఎండిగా కొనసాగుతున్నారు. శ్రీధర్ 1997 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు క్యాడర్లలో సేవలందించారు. మొదట రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా, ఊట్నూరు ఐటీడీఏ పీఓగా, స్పోర్ట్ డైరెక్టర్‌గా కాకినాడలో, అనంతరం అనంతపురం, కృష్ణ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కలెక్టర్‌గా పని చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ సెక్రటరీగా మూడేళ్ల మూడు నెలల పా టు విధులు నిర్వర్తించారు. తెలంగాణ ఏర్పాట తర్వాత నుంచి 2015 జనవరి 1 నుంచి ఇప్పటి వరకు తెలంగాణలోని సింగరేణి కంపెనీ కాలరీస్ లిమిటెడ్ సిఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఎన్‌ఎండిసి చైర్మన్‌గా పూర్తి బాధ్యతలు ఆయన చేపట్టడానికి రెండు నెలల సమయం పడుతుందని అప్పటివరకు ఆయన సింగరేణి సిఎండిగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. త్వరలోనే సింగరేణి సిఎండిగా మరో సీనియర్ ఐఏఎస్‌ను నియమించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News