Thursday, December 19, 2024

కేజ్రీవాల్ జైలు నుంచి ప్రకటించిన ఆరు హామీలివే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గడిచిన 75 ఏళ్లుగా ఢిల్లీ ప్రజలకు అన్యాయం జరుగుతోందని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశ రాజధానికి పూర్తి స్థాయి రాష్ట్రహోదా కల్పిస్తామని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నట్టు ఆయన సతీమణి సునీత వెల్లడించారు. విపక్ష కూటమి ఆదివారం ఢిల్లీలో చేపట్టిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆమె ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు.

విద్య, వైద్యంతోపాటు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని, విపక్ష కూటమికి అవకాశం కల్పిస్తే గొప్ప దేశాన్ని నిర్మిస్తామని కేజ్రీవాల్ తన సందేశంలో పేర్కొన్నారు. భారతమాత ఇబ్బందుల్లో ఉందని, ఈ దౌర్జన్యం పనిచేయదని, సునీత అన్నారు. తన భర్తకు దేశ వ్యాప్తంగా ఎంతో మద్దతు లభిస్తోందన్నారు. ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగిన సభలో భావోద్వేగ ప్రసంగం చేసిన సునీత, కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

దేశ ప్రజలు కేజ్రీవాల్ తోనే ఉన్నారని, ఆయనను ఎప్పటికీ జైళ్లోనే ఉంచలేరన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ పంపిన సందేశం లోని ఆరు గ్యారంటీలను వెల్లడించారు. “దేశ వ్యాప్తంగా కరెంట్ కోతలు ఉండవు, పేదలకు ఉచిత విద్యుత్ అమలు, సమాజం లోని అన్ని వర్గాల కోసం నాణ్యమైన విద్య అందించేందుకు ప్రతి గ్రామంలో మంచి పాఠశాల, ప్రతి గ్రామం లోనూ మొహల్లా క్లినిక్, ప్రతి జిల్లాకు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, స్వామినాథన్ నివేదిక ఆధారంగా రైతుల పంటలకు కనీస మద్దతు ధర, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా కల్పిస్తాం ” అని కేజ్రీవాల్ తన సందేశంలో పేర్కొన్నారు. ఐదేళ్లలో ఈ ఐదు హామీలను నెరవేరుస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News