Thursday, December 19, 2024

కేజ్రీవాల్ అరెస్ట్‌పై ప్రజలు ఓట్ల ద్వారా స్పందిస్తారు : సునీతా కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : ప్రజలు చాలా చురుకైన వారని, ఢిల్లీ ముఖ్యమంత్ర కేజ్రీవాల్ అరెస్టుకు ఓట్ల ద్వారా తమ స్పందన తెలియజేస్తారన్న నమ్మకం తమకుందని కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ గురువారం వెల్లడించారు. గుజరాత్‌లోని భారూచి, భావనగర్ లోక్‌సభ నియోజక వర్గాల నుంచి పోటీ చేస్తున్న ఆమ్‌ఆద్మీపార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ర్యాలీల్లో ప్రచారం చేయడానికి ఆమె అహ్మదాబాద్ వచ్చారు.

“ వారు(బీజేపీ) ఎన్నికల సందర్భంగా బలవంతంగా కేజ్రీవాల్‌ను కారాగారంలోకి నెట్టారని, అందువల్ల కేజ్రీవాల్ గొంతుక ప్రజలకు చేరడం లేదని ఆమె పేర్కొన్నారు. కానీ ప్రజలు చాలా తెలివైన వారని, దీనికి తగిన రీతిలో ఓట్ల ద్వారా గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. ఆప్ రాజ్యసభ సభ్యుడు సందీప్ పాథక్ కూడా సునీతా కేజ్రీవాల్‌తో కలిసి అహ్మదాబాద్ వచ్చారు. మతప్రాతికపై ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించడంపై ధ్వజమెత్తారు. “ ఎన్నికల ముందే ఇవన్నీ ఎందుకు గుర్తు పెట్టుకుంటారని ప్రధాని మోడీని తాను అడగాలనుకుంటున్నాను.

మీరు చేసే పనిబలం బట్టి ఎందుకు ఓట్లు అడగరు ? పాకిస్థాన్‌కు ప్రధాని పెద్ద స్నేహితుడని తాను భావిస్తున్నాను ” అని సందీప్ వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు రోజు గుజరాత్ లోని ఆనంద్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాకిస్థాన్‌కు కాంగ్రెస్ విదేయుడుగా వ్యాఖ్యానించారు. యువరాజు (రాహుల్)ను పాకిస్థాన్ భారత ప్రధానిగా చేయాలని తహతహ లాడుతోందని మోడీ ఎద్దేవా చేశారు.

దీనిపై పాథక్ మోడీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజలు పరిపక్వత చెందారని, వారిప్పుడు జీవితంలో ఆస్పత్రులు, పాఠశాలలు, బాగుండాలని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. గుజరాత్ లోని 26 ఎంపి స్థానాలకు విపక్ష కూటమి ఇండియా సీట్ల సర్దుబాటులో భాగంగా రెండు సీట్లలో ఆప్ అభ్యర్థులను ప్రజలు నిలబెట్టారని పాథక్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఢిల్లీ లోని కేజ్రీవాల్ పాలనా తీరు చూసి కేజ్రీవాల్‌పై ప్రేమ చూపించారని పేర్కొన్నారు. గుజరాత్ ప్రజలు బీజేపీ అతివిశ్వాసాన్ని చెల్లా చెదురు చేస్తారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News