Tuesday, January 7, 2025

‘కేజ్రీవాల్ కో ఆశీర్వాద్’ వాట్సాప్ ప్రచారాన్ని ఆరంభించిన కేజ్రీవాల్ భార్య

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని స్థానిక కోర్టు ఏప్రిల్ 1 వరకు పొడగించిన నేపథ్యంలో, ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్  వాట్సాప్ ప్రచారం ‘కేజ్రీవాల్ కో ఆశీర్వాద్’ను ఆరంభించారు. ‘ మేము ఈ ప్రచారాన్ని నేటి నుంచి ఆరంభించాము. మీరు ఈ నంబరుపై కేజ్రీవాల్ కు ఆశీసులు, ప్రార్థనలు పంపండి. మీకు తోచిన మెసేజీలు కూడా పంపండి’ అని సునీతా కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆమె తెలిపిన WhatsApp number — 8297324624.

ఇదిలావుండగా మద్యం కుంభకోణంలో ఈడి ఇప్పటి వరకు 250 దాడులు నిర్వహించిందని, కానీ ఒక్క పైసా కూడా పట్టుకోలేదని కేజ్రీవాల్ అన్నారు. మా ఇంటికి చాలా మంది బ్యూరోక్రట్లు వచ్చిపోతుంటారు. నా పై వచ్చిన నాలుగు స్టేట్ మెంట్లు తప్పుడివి. ఓ సిట్టింగ్ సిఎం ను అరెస్టు చేయడానికి ఈ స్టేట్ మెంట్లు సరిపోతాయా? అప్రూవర్లుగా మారిన వారిచేత వారి స్టేట్ మెంట్లు మార్చుకోమని బలవంతపెడుతున్నారు కూడా. ఈడి ఉద్దేశ్యం ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ ని అణచివేయడమే. అసలైన లిక్కర్ స్కామ్ ఈడి పరిశోధన అనంతరమే మొదలయిందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇదిలావుండగా ఇండియా కూటమి మార్చి 31న ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించబోతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News