Wednesday, January 22, 2025

అవినాశ్ తల్లికి శస్త్ర చికిత్స జరగలేదు, చర్యలు తీసుకోండి: సునీతా రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డి తన తల్లికి శస్త్ర చికిత్స జరుగుతోందని కోర్టుకు తెలిపారని, కానీ శస్త్ర చికిత్స జరగలేదని సునీతా రెడ్డి బుధవారం తెలంగాణ హైకోర్టుకు మెమో సమర్పించారు. అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాది ఇచ్చిన హామీతో తుది ఉత్తర్వులు జారీ చేసే దాకా అరెస్టు చేయరాదంటూ కోర్టు మే 27న మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

మీడియా కథనాల ప్రకారం అవినాశ్ రెడ్డి తల్లికి శస్త్ర చికిత్స జరగలేదని తెలిసిందన్నారు సునీతా రెడ్డి. శస్త్రచికిత్స జరుగుతోందని న్యాయవాది చేసిన ప్రకటన తప్పు అని, నిర్ధారించడానికి రికార్డులు లేనందున గత ఆదేశాల ప్రకారం అవినాశ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సునీతా రెడ్డి తరఫు న్యాయవాది కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ సంబంధిత రికార్డులు సమర్పించారు కదా అని ప్రశ్నించినప్పుడు, శస్త్రచికిత్స జరిగినట్లు రికార్డులు లేవని న్యాయవాది తెలిపారు. తమ మెమోను పరిశీలించి చర్యలు తీసుకోవాలని న్యాయవాది విజ్ఞప్తి చేయగా న్యాయమూర్తి మెమోను తీసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News