Thursday, December 26, 2024

సునీతా విలియమ్స్ అంతరిక్షంలో నెలల తరబడి వేచి ఉండాల్సి రావొచ్చు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ స్పేస్క్రాఫ్ట్ ద్వారా రోదసిలోకి వెళ్లిన ఇద్దరు వ్యోమాగామలు ఎప్పుడు నేలకు తిరిగి వస్తారన్నది అగమ్యగోచరంగా ఉంది.  ఆ ఇద్దరు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్.

సునీతా విలియమ్స్ కు ఇది మూడో రోదసి యాత్ర. కానీ ఆమె ఎప్పుడు భూమి మీదికి తిరిగొస్తారన్నది తెలియడం లేదు. స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో వారి తిరుగు ప్రయాణం వాయిదా పడింది.

నాసా కమర్షియల్ క్ర్యూ ప్రొగ్రాం మేనేజర్ స్టీవ్ స్టిచ్ కాస్తా స్టార్లయినర్స్ మిషన్ ప్రోగ్రాంని 45 రోజుల నుంచి 90 రోజులకు పొడగించే విషయాన్ని పరిశీలిస్తున్నారని సిఎన్ఎన్ నివేదించింది.

స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి హీలియం లీకవుతోందని అధికారులు చెబుతున్నారు. వ్యోమనౌకలో హీలియం లీకేజీ సమస్యను సరిదిద్దే ప్రయత్నంలో స్టార్ లైనర్ ఇంజనీర్లు ఉన్నారు.  

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News