Saturday, November 23, 2024

ఇదొక గొప్ప అడుగు… ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: సునీతా విలియమ్స్

- Advertisement -
- Advertisement -

నూయార్క్ : చంద్రయాన్ 3 మిషన్ కీలక దశకు చేరుకున్న వేళ… దేశ విదేశాల్లో ఈ ఘట్టంపై ఉత్కంఠ నెలకొంది. తాను కూడా ఈ ఈవెంట్ కోసం ఎంతోఉత్సాహంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ పురోగతిని కొనియాడుతూ చంద్రయాన్ 3 ప్రయత్నాన్ని ఒక గొప్ప అడుగుగా అభివర్ణించారు.

చంద్రుడిపై పరిశోధనలు కేవలం విజ్ఞానానికే పరిమితం కాదని, భూమికి ఆవల స్థిరమైన నివాస అవకాశాలను అన్వేషిస్తాయని ఓ టీవీ ఛానెల్‌తో అన్నారు. చంద్రుడిపై ల్యాండింగ్ , మనకెంతో అమూల్యమైన సమాచారాన్ని అందిస్తుంది. అంతరక్ష పరిశోధనలు, జాబిల్లిపై స్థిర నివాసం అన్వేషణల విషయంలో భారత్ ముందంజలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ” అని సునీతా విలియమ్స్ పేర్కొన్నారు. ఇది చంద్రుడి దక్షిణ ధ్రువంపై స్థిరమైన మానవ నివాసాలను స్థాపించేందుకు అనువైన ప్రదేశాలును గుర్తించడంలో సహాయ పడుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News