Tuesday, March 18, 2025

మరికొన్ని గంటల్లో భూమ్మీదకు సునీతా విలియమ్స్

- Advertisement -
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ కలిగిస్తున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మరికొద్ది గంటల్లో భూమ్మీదకు రానున్నారు. 9 నెలల సుదీర్ఘ కాలం తరువాత ఎట్టకేలకు తిరిగి భూమికి ప్రయాణం కావడానికి మార్గం సుగమం కావడంతో వారి అపూర్వ ప్రయాణాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు , భారత కాలమానం ప్రకారం మార్చి 19 అంటే బుధవారం తెల్లవారు తెల్లవారు జాము 3.27 గంటలకు వారు భూమి మీదకు చేరుకోనున్నారు. వాస్తవానికి వారు బుధవారం బయలు దేర వలసి ఉండగా ఈ షెడ్యూల్‌ను నాసా ఒకరోజు ముందు జరిపింది. ఈమేరకు నాసా అప్‌డేట్ షెడ్యూల్ విడుదల చేసింది. స్సేస్‌ఎక్స్ నాసా సంయుక్తంగా పంపించిన క్రూ10 ఆదివారం ( మార్చి 16న) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. నలుగురు వ్యోమగాములు అన్నెమెక్ క్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్‌లు ఐఎస్‌ఎస్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ స్థానాలను భర్తీ చేశారు.

స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ 9 లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ బయలుదేరుతున్నారు. మంగళవారం సాయంత్రం అంతరిక్ష కేంద్రం ఫోటోలు 41 నిమిషాల పాటు తీసిన తరువాత సాయంత్రం 4.45 గంటలకు 41 నిమిషాల వ్యవధిలో సోలార్ ప్యానెల్ ద్వారా క్రూ డ్రాగన్ బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి. సోమవారం రాత్రి 10.45 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమవుతుంది. సోమవారం అర్థరాత్రి 12.45 గంటలకు అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్‌డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. విజయవంతంగా విడిపోయిన తరువాత తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.11 గంటలకు భూకక్షలను దాటుకుని వ్యోమనౌక కిందకు వస్తుంది. భూమిమీదకు ల్యాండ్ అయ్యే ముందు థ్రస్టర్ ఆన్ కాగానే కాప్సూల్ వేగం తగ్గి నెమ్మదిగా భూమి పైకి వస్తుంది. ల్యాండింగ్ మరో 3 నిమిషాలు ఉందనగా, 3 పారాచ్యూట్లు తెరుచుకుంటాయి. వీరి స్పేస్‌ఎక్స్ కాప్సూల్ ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న అట్లాంటిక్ సముద్రజలాల్లో దిగుతుంది. ఆ సమయానికి అక్కడ సిద్ధంగా ఉన్న స్పేస్ ఎక్స్ టీమ్ ఈ వ్యోమగాములను బయటకు తీసుకు వస్తారు.

ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు
వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తిరుగు ప్రయాణాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 815 గంటల నుంచి లైవ్ కవరేజి చూడవచ్చు. నాసా అధికారిక వెబ్‌సైట్ , మొబైల్‌యాప్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికలపై ఈ ప్రత్యక్ష ప్రసారాన్నిచూడవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News