Thursday, December 26, 2024

నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర

- Advertisement -
- Advertisement -

కేప్ కెనావెరాల్ : భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర నిలిచిపోయింది. వారు వెళ్లాల్సిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్‌లో సాంకేతికత లోపం తలెత్తడమే దీనికి కారణం. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు రాకెట్ నింగి లోకి దూసుకెళ్లాల్సి ఉంది. కానీ చివర్లో గుర్తించిన లోపం కారణంగా ప్రస్తుతానికి ఈ మిషన్‌ను వాయిదా వేస్తున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రకటించింది. తిరిగి ఎప్పుడు చేపడతారనేది మాత్రం వెల్లడించలేదు.

ఫ్లోరిడా లోని కేప్ కెనావెరాల్‌లో ఉన్న కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్‌కు చెందిన అట్లాస్ v రాకెట్ నింగి లోకి దూసుకెళ్లడానికి సిద్ధమైంది. సరిగ్గా 90 నిమిషాల ముందు మిషన్‌ను ఆపేస్తున్నట్టు నాసా ప్రకటించింది. రాకెట్ లోని ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్ పనితీరు అసాధారణంగా ఉన్నట్టు గుర్తించామని తెలియజేసింది. అప్పటికే వ్యోమనౌక లోకి ప్రవేశించిన సునీతా విలియమ్స్‌తోపాటు మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News