సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్షకేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ మరోసారి స్పేస్‌వాక్ నిర్వహించారు. ఎనిమిది నెలల తరువాత రెండోసారి ఆమె కేంద్రం వెలుపలకు వచ్చారు. మరో వ్యోమగామి విల్‌మోర్ , సునీతా శూన్యంలో వాక్ చేశారు. సునీత విలియమ్స్ , విల్‌మోర్‌లు ఎనిమిది రోజుల మిషన్‌లో భాగంగా గత ఏడాది జూన్ 6ప బోయింగ్ స్టార్‌లైనర్ కాప్సూల్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అదే నెల 14 న వారు తిరిగి భూమికి రావలసి ఉండగా, వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదురై అక్కడే చిక్కుకు పోయారు.
ప్రస్తుతం స్టేషన్ కమాండర్‌గా వ్యవహరిస్తున్న ఆమె , నాసాకు చెందిన మరో వ్యోమగామితో కలిసి ఐఎస్‌ఎస్‌కు కొన్ని మరమ్మతులు చేయాల్సి ఉంది. 2022లె ఆమె చివరిసారి స్పేస్‌వాక్ నిర్వహించగా, ఇటీవల ఎనిమిదోసారి వాక్ చేశారు. తాజాగా మరోసారి స్పేస్ వాక్ చేశారు. సునీతా ప్రస్తుతం మూడో రోదసీ యాత్రలో ఉన్నారు. గతంలో 2006. 2012లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. 2012 నాటికి ఏడు స్పేస్ వాక్‌లు నిర్వహించి మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు అంతరిక్షంలో ఉన్నారు. ఈ ఏడాది మార్చి చివర్లో లేదా ఏప్రిల్‌లో భూమికి తిరుగు ప్రయాణమయ్యే అవకాశం ఉందని సమాచారం.