Saturday, March 15, 2025

త్వరలో భూమ్మీదకు సునీత విలియమ్స్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ త్వరలోనే భూమ్మీద అడుగుపెట్టనున్నారు. నాసా-స్పేస్ ఎక్స్‌లు కలిసి చేపట్టిన క్రూ-10 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగామిలతో కూడిన ఫాల్కన్-9 రాకట్ ఈరోజు ఉదయం 4.33 నిమిషాలకు కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. 2024 జూన్‌లో సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్, నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ మిషన్ క్రూ-9 మిషన్‌లో భాగంగా బోయింగ్ స్టార్‌లైనర్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు.

అయితే వీళ్లు వెళ్లిన రాకెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో… నిక్‌ హేగ్, అలెగ్జాండర్ గోర్పోవ్‌లు తిరిగి భూమి మీదకు వచ్చారు. కానీ, సునీతా విలియమ్స్, బచ్‌ విల్మోర్ అక్కడే ఉండిపోయారు. దాదాపు 9 నెలలుగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లోనే ఉంటున్నారు. అమెరికాలో రెండోసారి అధికారంలోకి రాగానే సునీతా, బచ్‌ని వెన్కక్కి తీసుకురావాలని నాసా-స్పేప్స్‌ను ఆదేశించారు. మూడు రోజుల క్రితమే క్రూ-10 మిషన్‌కు ఏర్పాట్లు చేశారు. దీంతో, సునీత, బచ్ మరో వారం రోజుల్లో భేమి మీదకు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News