Tuesday, September 17, 2024

మరో 200 రోజులు అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్: నాసా

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్ మరో ఆరు నెలలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోనే ఉండనున్నారు. అంతరిక్షంలోకి వెళ్లిన వారి ‘స్టార్ లైనర్’ అనే స్పేస్ క్రాఫ్ట్ తాలూకు  థ్రస్టర్ దెబ్బతిని పనిచేయకపోవడంతో హీలియం లీకేజీకి గురయింది. దాంతో ఆ స్పేస్ క్రాఫ్ట్ ను తాత్కాలికంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అటాచ్ చేశారు.  సునీతా విలియమ్స్, బ్యారీ బుచ్ అంతరిక్షంలోకి వెళ్లి ఇప్పటికే 80 రోజులు దాటిపోయింది. కాగా వారు తిరిగి భూమిపై వచ్చేది ఫిబ్రవరిలోనే అని తెలుస్తోంది. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటుండటం వల్ల వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని సమాచారం.  సునీతా విలియమ్స్ మరో 200 రోజులు అంతరిక్షంలోనే ఉండాల్సి వస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) తన ప్రకటనలో తెలిపింది.

ఎలాన్ మస్క్ కు చెందిన ‘స్పేస్ ఎక్స్’ కంపెనీ ‘క్రూ-9’ మిషన్ ద్వారా అనేక మంది వ్యోమగాములు సెప్టెంబర్ 24న అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. వారు 2025 ఫిబ్రవరి నెలలో తిరిగి భూమిపైకి రానున్నారు. వారితో పాటు సునీతా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్ కూడా తిరిగి వస్తారని ‘నాసా’ వెల్లడించింది. కాగా ‘స్టార్ లైనర్’ వ్యోమనౌకను సిబ్బంది లేకుండానే భూమికి నేవిగేట్ చేసి తీసుకురానున్నట్లు కూడా సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News