Wednesday, January 22, 2025

అమెరికా ఎన్నికల్లో పాల్గొననున్న సునీతా విలయమ్స్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: రోదసిలోకి వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తమ ఓటును రోదసి నుంచే వేయనున్నారు. నాసా ఇందుకు ఏర్పాట్లు చేసింది. వారు రోదసి నుంచే తమ బ్యాలెట్లను ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఉపయోగించుకోనున్నారు. వారి ఎన్ క్రిప్టెడ్ బ్యాలెట్ స్పేస్ స్టేషన్ నుంచి మిషన్ కంట్రోల్ కు ప్రసారం అవుతుంది. తర్వాత అది వ్యోమగామి తాలూకు కౌంటీ క్లర్క్ కు చేరుతుంది. వారి ఎలక్ట్రానిక్ బ్యాలెట్ 1.2 మిలియన్ మైల్స్ దూరం నుంచి రోదసి నుంచి భూతలానికి చేరుకుంటుంది. టెక్సాస్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు బ్యాలెట్లు చేరుకుంటాయి. వారి ఓట్లను వ్యోమగామి కౌంటీ క్లర్క్ ఫైనలైజ్ చేస్తాడు. ఇదివరలో 1997లో డేవిడ్ వోల్ఫ్ తొలిసారి రోదసి నుంచి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. కాగా 2020 ఎన్నికల్లో కేట్ రూబిన్స్ తన ఓటును వినియోగించుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News