Friday, January 17, 2025

మానవ అక్రమ రవాణా అరికట్టేందుకు సమిష్టి కృషి

- Advertisement -
- Advertisement -

Sunitha Lakshma reddy on combat Human trafficking

మూడో శనివారం ఐసిడిఎస్ పరిధిలో స్వరక్ష డే
సమిష్టి పోరుపై ఆరు రాష్ట్రాల ఉమ్మడి ఒప్పందం
రెండు రోజుల సదస్సులో పలు నిర్ణయాలు
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి

హైదరాబాద్ : మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు అందరం సమిష్టిగా కృషిచేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ, ఒడిస్సా రాష్ట్రాలు మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ఉమ్మడి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. మానవ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో రెండు రోజుల సదస్సు ముగిసింది. సదస్సులో పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు సమిష్టిగా కృషి చేసేందుకు ముందుకు కదులుతున్నాయన్నారు. డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా ప్రపంచంలో మూడో అతిపెద్ద వ్యవస్థీకృత నేరం ఇదేనని ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం అక్రమ రవాణాకు గురవుతున్న వారిని గుర్తించి రక్షించడంతో పాటు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణనిస్తూ ఇతర సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు శాఖ జిల్లాల్లో ఎహెచ్‌టియు ఏర్పాటు చేసిందని, అవగాహన సదస్సులు నిర్వహిస్తోందని తెలిపారు. మహిళా కమిషన్ చట్టాలపై అవగాహన కల్పిస్తోందని జిల్లాల్లో అవగాహనా సదస్సులు నిర్వహిస్తోందన్నారు. పిల్లలు, మహిళలపై సైబర్ నేరాలు, ఆన్‌లైన్ ట్రాఫికింగ్ అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యునిట్స్, షీ సైబర్ సెల్ ఏర్పాటు చేసిందన్నారు. సాధారణ వ్యక్తులు కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి తెలుసుకోడానికి ప్రభుత్వం ధృవ పోర్టల్ ఏర్పాటు చేసిందన్నారు. ప్రజ్వల ఎన్‌జిఓతో కలిసి హ్యూమన్ ట్రాఫికింగ్ ను అరికట్టేందుకు తెలంగాణ పోలీసు శాఖ వికల్ప ఏర్పాటు చేసిందని తెలిపారు. ట్రాఫికింగ్ మహిళల కోసం రాష్ట్రంలో నాలుగు అబ్జర్వేషన్ హోమ్స్, రెండు స్పెషల్ హోమ్స్ ఉన్నాయని అన్నారు. ఒడిస్సా నుంచి వలస వచ్చిన కూలీల పిల్లల కోసం, ట్రాఫికింగ్‌లో గుర్తించిన వారి కోసం యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో పోలీసు శాఖ, శిశు సంక్షేమ శాఖ కలిసి ఒరియా పాఠశాలను ఏర్పాటు చేశారని వివరించారు.

ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో స్వరక్ష డే

మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెలా మూడో శనివారం రాష్ట్రంలో అన్ని ఐసిడిఎస్ ప్రాజెక్టులలో స్వరక్ష డే నిర్వహించడం జరుగుతుందని చైర్‌పర్సన్ సునీతా లకా్ష్మరెడ్డి తెలిపారు. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు అంతర్రాష్ట్ర సహకారంతో ఎంతో ముఖ్యమని చైర్‌పర్సన్ అన్నారు. అక్రమ రవాణాను అరికట్టడంలో తేలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని తెలిపారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు ఇతర రాష్ట్రాలతో కలిసి కౌన్సిల్ ఏర్పాటు చేయాలన్నారు. మహిళల రక్షణ, గౌరవం, సాధికారితపై అందరం సమిష్టిగా కృషిచేయాలన్నారు. శనివారం రెండోరోజు సదస్సులో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కమిషనర్ దివ్యా దేవరాజన్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, ఒడిషా, తమిళనాడు రాష్ట్రాల మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌లు,శిశు సంక్షేమ శాఖల కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News