Monday, December 23, 2024

మహిళా కమిషన్ చైర్మన్ అనితర సాహసం..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్ : ఆపదలో ఉన్న మహిళా ప్రయాణికురాలి ప్రాణాలు, నగదును రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి కాపాడారు. సుమారు ఒక కిలోమీటర్ మేర ఆటోను చేజ్ చేసి ఆటో డ్రైవర్‌ను, అతనితో ఉన్న మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ముస్లిం సోదరులకు రంజాన్ శు భాకాంక్షలు తెలిపి మరో కార్యక్రమానికి తిరిగి వస్తున్నారు. అప్పటికే ఓమహిళను ట్రాప్ చేసిన ఆటో డ్రైవర్ అతని సహాయకురాలు సరిగ్గా బీవీఆర్‌ఐటీ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఆటోను రోడ్డు పక్కకు ఆపి ఆ మహిళా ప్రయాణికురాలి గొంతుపై కత్తిపెట్టి పుస్తెల తాడు కాజేశారు.

ఈక్రమంలో అటుగా వెళ్లుతున్న సునీతా లకా్ష్మరెడ్డి వాహనాన్ని చూసి మహిళ బిగ్గరగా కేకలు వేసింది. ఆర్తనాదాలు విన్న ఆమె కాన్వాయ్‌ని ఆపడంతో ఆటో డ్రైవర్, అతని సహాయకురాలు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఏమైందోనని బాధిత మహిళ నుంచి వివరాలు తెలుసుకుంటుండగా ఆటో డ్రైవర్ వేగం పెంచి ఆటోను కిలోమీటర్ పాటు చేజ్ చేసి ఇద్దరి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పుస్తెలతాడును తీసుకుని బాధిత మహిళకు అప్పగించారు. బాధితురాలుకు దైర్యం చెప్పిన సునీతా లకా్ష్మరెడ్డి నిందితులు సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News