Thursday, January 23, 2025

ఆ వార్తలను ఖండిస్తున్నాం: సునీతా లక్ష్మారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాలను ఖండిస్తున్నామని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. తాము ఎవరితోనూ చర్చలు జరపడంలేదని, ప్రొటోకాల్, ఎస్కార్ట్ ఇవ్వడం లేదని సిఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో పాటు మెదక్ జిల్లా సమస్యలు వివరించేందుకు కలిశామని వివరించారు. బిఆర్‌ఎస్ ప్రెసిడెంట్ కెసిఆర్ నాయకత్వంలోనే పని చేస్తామని, పార్టీ మారే ఉద్దేశం తమకు లేదని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తమ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని కోరడం తమ హక్కు అని సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని కోరడం సాధారణమేనని, మెదక్ జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సిఎంను కోరామని, తమ ప్రతిష్ఠకు భంగం కలిగించిన వారిపై పరువు నష్టం దావా చేస్తామని సునీతా హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News