హైదరాబాద్: వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో దస్తగిరిని ఢిల్లీకి పిలిచి చాలా రోజులు సిబిఐ తన దగ్గర ఉంచుకోవడంతోనే అతడిని అప్రూవర్‌గా మార్చారని ఎంపి అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్యలో తనకు ఎలాంటి సంబంధం లేదని పిటిషన్‌లో అవినాష్ రెడ్డి తెలిపారు. సోమవారం అవినాష్ రెడ్డిని సిబిఐ విచారణ చేస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో తనపై ఎలాంటి ఆధారాలు లేవని, దస్తగిరి స్టేట్‌మెంట్ ఒక్కటే ప్రాముఖ్యంగా సిబిఐ తీసుకుందన్నారు. ఈ కేసుల ఇప్పటివరకు తాను నిందితుడిగా లేనన్నారు. 2021 వరకు సిబిఐ తనని ఛార్జ్‌సీట్‌లో అనుమానితుడి చేర్చలేదని, తనపై నేరం రుజువు చేయడానికి సిబిఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. వివేకా కుమార్తె సునీత స్థానిక ఎంఎల్‌సితో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సిబిఐ అధికారితో కుమ్మక్కయ్యారని అవినాష్ రెడ్డి ఆరోపణలు చేశారు.
Also Read: గుండె వైఫల్యాన్ని నివారించే మాత్ర
వివేకా తన రెండో భార్యతో ఆర్థికంగా పాలు పంచుకుంటున్నాడని సునీత కక్ష గట్టిందన్నారు. వివేకా కుమార్తె సునీత, సిబిఐ స్థానిక ఎంఎల్‌సి ద్వారా ప్రతిపక్ష నేతతో కుట్ర పన్ని, తనని, తన కుటుంబాన్ని దెబ్బతీయడానికి ప్లాన్ వేశారని దుయ్యబట్టారు. సునీతకు , వివేకా రెండో భార్యకు మధ్య విభేదాలు ఉన్నాయని, వివేకా రెండో భార్య కుమారుడికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీటు ఇప్పిస్తానని వివేకా హామీ ఇచ్చారని అవినాష్ రెడ్డి గుర్తు చేశారు. స్కూల్ పక్కనే విల్లా కొనుగోలు చేసేందుకు వివేకా ప్లాన్ చేశారని, వివేకా రెండో భార్య కుటుంబానికి డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే ప్లాన్ తెలిసి వివేకాతో సునీత గొడవ పడ్డారన్నారు.