Wednesday, January 22, 2025

పొంగుతున్న తుంగభద్ర

- Advertisement -
- Advertisement -

కృష్ణానదికి ప్రధాన ఉపనదిగా ఉన్న తుంగభద్ర పొంగుతోంది. ఎగువన కర్ణాటకలో నదీ పరివాహకంగా కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర నదిలో వరదనీటి ప్రవాహం భారీగా పెరిగింది. రాజోలి సమీపాన తెలంగాణ,ఆంధప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న సుంకేసుల జలాశయం పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వదరనీటిని దృష్టిలో ఉంచుకొని సుంకేజుల బ్యారేజి రెండు గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తునారు.

ఎగువ నుంచి బ్యారేజిలోకి 8500క్యూసెక్కుల నీరు చేరుతుండగా, రెండు గేట్లను ఒక మీటరు చొప్పున పైకి ఎత్తి 8200క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు కర్నూలుకడప కాలువకు కూడా నీటిని విడుదల చేశారు.సుంకేసుల జలాశయం పూర్తి స్థాయి నీటినిలువ సామర్దం 1.20టిఎంసీలు కాగా ఇప్పటికే బ్యారేజిలోకి 1.10టిఎంసీల నీరు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News