మూడు డిగ్రీలు పెరిగే అవకాశం :ఐఎండి
మనతెలంగాణ/హైదరాబాద్: ఎండలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు 39డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని , కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ , ఉత్తర కర్ణాటక, మహారా్రష్ట్ర ,ఒడిశాలోని పలు ప్రాంతాల్లో వేడిగాలుల తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.పెరుగుతున్న ఎండల తీవ్రత పట్ల ప్రజలు అప్రత్తంగా ఉండాలని సూచించింది. ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట, నల్లగొండ, వనపర్తి జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా 39డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా వరంగల్‌లో 36.8డిగ్రీలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 38.8డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.