Wednesday, January 22, 2025

మనవడి పెళ్లిలో ధర్మేంద్ర డ్యాన్స్(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ప్రముఖ నటుడు, బిజెపి ఎంపి సన్నీ దేవల్ కుమారుడు, అలనాటి ప్రముఖ నటుడు ధర్మేంద్ర మనవడు కరఱ్ దేవల్, అతని చిరకాల గర్ల్‌ఫ్రెండ్ ద్రిషా ఆచార్యనుల పెళ్లి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అలనాటి ప్రముఖ సినీ నిర్మాత బిమల్ రాయ్ మునివనవరాలే ద్రిష ఆచార్య.

వివాహ మహోత్సవం కోసం దేవల్ బంగళా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇటీవల సాంప్రదాయ మెహెందీ, హల్దీ, సంగీత వేడుకలు జరిగాయి. తన మనవడి పెళ్లి వేడుకల్లో 80వ దశకంలో ఉన్న ధర్రేంద్ర నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

బంగారురంగు కుర్తా పైజామా ధరించి కరణ్ దేవల్ చిరునవ్వులు చిందిస్తూ కారులో వివాహ వేదికకు చేరుకున్నారు. అతని చేతి మీద మెహెందీతో దృషా పేరు రాసుకున్నాడు. పెళ్లి కుమారుడి తండ్రి సన్నీ దేవల్ గులాబీ రంగు షర్ట్, తెల్ల ప్యాంట్ ధరించడమేగాక చేతులకు హెన్నా పెట్టుకున్నారు. బధాయి హో చిత్రంలోని మోర్నీ బన్కే పాటకు సన్నీ దేవల్, తన తండ్రి ధర్మేంద్రతో కలసి డ్యాన్స్ చేశారు. పంజాబీ స్టయిల్‌లో ధర్మేంద్ర స్టెప్పులు వేశారు. కరణ్ బాబాయ్‌లు బాబీ, అభయ్ దేవల్ కూడా తమ అన్న కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.

కొద్ది రోజుల క్రితమే కరణ్, ద్రిషాల నిశ్చితార్థం జరిగింది. పెళ్లి వేడుకలు రెండు కుటుంబాలకు చెందిన బంధువులకే పరిమితం చేస్తుండగా ముంబైలో తర్వాత భారీ రెసెప్షన్ జరగనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News