Saturday, December 21, 2024

ఛాలెంజింగ్ రోల్‌లో నటించా

- Advertisement -
- Advertisement -

Sunny Leon interivew about 'Ginna' Movie

హీరో మంచు విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ నటీనటులుగా ఈషాన్ సూర్య హెల్మ్ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై నిర్మిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘జిన్నా’. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ నెల 21న గ్రాండ్‌గా విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…
సైకలాజికల్ థ్రిల్లర్…
తెలుగులో పూర్తి స్థాయిలో నటిస్తున్న నా మొదటి చిత్రం జిన్నా. మెహన్ బాబు ప్రొడక్షన్ హౌస్‌లో మంచు విష్ణుతో నటిస్తున్న మొట్ట మొదటి సైకాలజికల్ థ్రిల్లర్ ఇది. ఇలాంటి కథలు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ కథ నచ్చి సినిమా చేస్తున్నాను.
మూగ, చెవిటి పాత్రలో…
ఇందులో నేను రేణుకగా చెవిటి, మూగ పాత్రలో ఛాలెంజింగ్ రోల్‌లో నటించాను. ఈ సినిమాలో మంచి స్టార్ క్యాస్ట్‌తో పాటు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి.
మంచి నటనను రాబట్టుకున్నారు…
విష్ణు చాలా ఎనర్జిటిక్ పర్సన్. తనతో యాక్టింగ్ చేయడం చాలా కంఫర్ట్‌గా ఉంది. అలాగే పాయల్‌తో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రేక్షకులు ఎంతో అభిమానం చూపుతారు. దర్శకుడు సూర్య నా దగ్గర నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు.
తదుపరి చిత్రాలు…
ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్ సిద్ధంగా ఉన్నాయి. అవన్నీ కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్‌లు. అలాగే డి గ్లామర్ రోల్‌లో అనురాగ్ కశ్యప్‌తో హిందీలో ఒక సినిమా చేస్తున్నాను.

Sunny Leon interivew about ‘Ginna’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News