Monday, December 23, 2024

సన్నీ లియోన్‌ని అనవసరంగా వేధిస్తున్నారు: కేరళ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

కొచ్చి: నటి సన్నీ లియోన్, ఆమె భర్త డేనియల్ వెబెర్, ఆమె ఉద్యోగిపై నమోదైన మోసగింపు కేసు(చీటింగ్ కేసు)ను కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నామని కేరళ హైకోర్టు తెలిపింది. సన్నీ లియోన్‌ని అనవసరంగా వేధిస్తున్నారని, ఆమెపై క్రిమినల్ కేసేది లేదని ఓరల్‌గా వ్యాఖ్యానించారు. ‘ఇందులో క్రిమినల్ నేరం ఎముంది? మీరు అనవసరంగా ఒకరిని(సన్నీ లియోన్) వేధిస్తున్నారు. నేను దీనిని కొట్టేయాలనుకుంటున్నాను’ అని ధర్మాసనం న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కాగా కోర్టు కేసును మార్చి 31కి వాయిదా వేసింది. దర్యాప్తును కొనసాగించుకొండి అని కూడా అన్నది.

కేరళకు చెందిన ఓ ఈవెంట్ మేనేజర్ ముగ్గురిపై చీటింగ్ కేసు పెట్టగా, కోర్టు 2022 నవంబర్ 16న స్టే ఇచ్చింది. లక్షలాది రూపాయలు చెల్లించినప్పటికీ సన్నీ లియోన్ ఈవెంట్‌లో పర్ఫామెన్స్ చేయలేదని, అసలు రానేలేదని ఆ ఈవెంట్ మేనేజర్ కేసు పెట్టాడు.

సన్నీ లియోన్, ఇతరులు తమకేమి తెలియదని, తమ మీద వచ్చిన ఆరోపణలను స్వీకరించినా కూడా తాము నేరం చేసినట్లు శిక్షార్హులం కాదని వాదించారు. ఫిర్యాదు దారుడికి ఎలాంటి నష్టం కలుగలేదని, కానీ పిటీషనర్లమైన తమ జీవితాలకి చాలా నష్టం కలిగిందని వాదించారు. తాము సివిల్ సూట్‌ను వేశామని, కానీ దానిని మెజిస్ట్రేట్ కోర్టు సాక్షం కావాలంటూ 2022 జులైలో కొట్టేసిందన్నారు. అందుకనే తాము కేసును కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News