Tuesday, November 5, 2024

సన్‌రైజర్స్ ‘గెలిచిందోచ్’..

- Advertisement -
- Advertisement -

Sunrisers beat Rajasthan Royals by seven wickets

రాణించిన రాయ్, విలియమ్సన్, రాజస్థాన్‌పై హైదరాబాద్ గెలుపు

దుబాయి: ఐపిఎల్ సీజన్14లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలక ఓ విజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. రెండో దశ మ్యాచుల్లో హైదరాబాద్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఇంతకుముందు యుఎఇలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ సన్‌రైజర్స్ ఓటమి పాలైంది. ఇక సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన హైదరాబాద్ 18.3 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సొంతం చేసుకుంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, జాసన్ రాయ్‌లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆరంభంలో సాహా దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేసిన సాహా స్కోరు పరిగెత్తించాడు. అయితే 11 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 18 పరుగులు చేసి స్టంపౌట్ అయ్యాడు. అప్పటికే తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించాడు.

ఆదుకున్న రాయ్, విలియమ్సన్

తర్వాత వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో కలిసి రాయ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రాయ్ తన మార్క్ షాట్లతో అలరించాడు. రాజస్థాన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించాడు. విలియమ్సన్ కూడా సమన్వయంతో ఆడుతూ తనవంతు పాత్ర పోషించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాయల్ 42 బతుల్లోనే 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 60 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన ప్రియమ్ గార్గ్ (0) ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. దీంతో సన్‌రైజర్స్ 119 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. కానీ అభిషేక్ శర్మ 21(నాటౌట్)తో కలిసి విలియమ్సన్ మరో వికెట్ కోల్పోకుండానే హైదరాబాద్‌కు విజయం సాధించి పెట్టాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కేన్ 41 బంతుల్లో ఒక సిక్స్ మరో ఐదు ఫోర్లతో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో హైదరాబాద్ ఘన విజయం అందుకుంది.

శాంసన్ జోరు..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ను మరోసారి కెప్టెన్ సంజు శాంసన్ ఆదుకున్నాడు. ఓపెనర్ ఎవిన్ లూయిస్ (6) ఆరంభంలోనే ఔటయ్యాడు. అయితే మరో ఓపెనర్ యశస్వితో కలిసి శాంసన్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్ ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో వేగంగా 36 పరుగులు చేశాడు. మరోవైపు కెప్టెన్ శాంసన్ 57 బంతుల్లోనే ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. మహిపాల్ 29 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించడంతో రాజస్థాన్ స్కోరు 164 పరుగులకు చేరింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News