Saturday, April 5, 2025

చేజేతులా ఓడడం బాధించింది.. సన్‌రైజర్స్ కోచ్ లారా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చేజేతులా ఓడడంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్ బ్రియాన్ లారా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. గెలిచే స్థితిలో ఉండి కూడా పరాజయం పాలు కావడం క్షమించరాని అంశమన్నాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించలేదని, తామే వారికి మ్యాచ్‌ను అప్పగించామని లారా వ్యాఖ్యానించాడు. పటిష్టస్థితిలో ఉండి కూడా ఓటమి పాలైతే ఇక చేసేదేమీ ఉండదన్నాడు.

ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమన్నాడు. ఈ సీజన్‌లో తాము ఆడిన చాలా మ్యాచుల్లో చేజేతులా ఓటమి పాలుకావడం ఎంతో బాధించిందన్నాడు. స్వల్ప లక్ష్యాలను సైతం ఛేదించలేక పోవడంపై లారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇకపై జరిగే మ్యాచుల్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఆటగాడిపై ఉందన్నాడు. బ్యాటింగ్ గాడిలో పడకపోతే ప్లేఆఫ్‌కు చేరడం దాదాపు అసాధ్యమని లారా అభిప్రాయపడ్డాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News