Sunday, January 19, 2025

ఈసారి అదరగొడతాం : కమిన్స్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐపిఎల్ సీజన్ 2024లో మెరుగైన ప్రదర్శనతో అదరగొడతాతమని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు. ఐపిఎల్ మినీ వేలం పాటలో కమిన్స్‌ను భారీ మొత్తం వెచ్చించి సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఊహించినట్టే కమిన్స్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఈ సీజన్‌లో హైదరాబాద్ టీమ్ అతని కెప్టెన్సీలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కొన్ని సీజన్లుగా సన్‌రైజర్స్ అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. పాయింట్ల పట్టికలో చిట్టచివరన నిలుస్తోంది. ఇలాంటి స్థితిలో కమిన్స్‌ను సారథిగా నియమించడంతో జట్టు ఆశలు చిగురించాయి.

కమిన్స్ సారథ్యంలో ఆస్ట్రేలియా పలు మెగా టోర్నీల్లో ట్రోఫీలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఐపిఎల్‌లోనూ తన సారథ్య ప్రతిభతో హైదరాబాద్‌ను విజయపథంలో నడిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈసారి జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతుందని కమిన్స్ స్పష్టం చేశాడు. తొలి పోటీ నుంచే దూకుడైన ఆటతో ముందుకు సాగుతామన్నాడు. జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని, వారిని సరైన దిశలో నడిపిస్తే మెరుగైన ఫలితాలు సాధించడం కష్టం కాదని కమిన్స్ అభిప్రాయపడ్డాడు. కాగా, ఈ మేరకు కమిన్స్ మాట్లాడిన వీడియోను సన్‌రైజర్స్ యాజమాన్యం అభిమానులతో పంచుకుంది.
ఓవర్‌లో రెండు బౌన్సర్లు..

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News