Sunday, January 19, 2025

ఢిల్లీ క్యాపిటల్స్‌ పై హైదరాబాద్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదో విజయం నమోదు చేసింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 67 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ గెలుపుతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 266 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ 32 బంతుల్లో (89), అభిషేక్ శర్మ 12 బంతుల్లో (46) పరుగులు చేశారు. చివర్లలో షాబాజ్ అహ్మద్ 29 బంతుల్లోనే 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 19.1 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. జాక్ ఫ్రెజర్ 18 బంతుల్లోనే 65, అభిషేక్ పొరెల్ 22 బంతుల్లోనే 42, కెప్టెన్ పంత్ (44) పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News