Tuesday, March 25, 2025

రెండు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో సన్‌రైజర్స్‌ తొలుత బ్యాటింగ్‌కి దిగింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. అయితే తీక్షణ బౌలింగ్‌లో బౌండరీకి ప్రయత్నించి అభిషేక్(24) జైశ్వాల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి ట్రావిస్ హెడ్ మంచి భాగస్వామ్యాన్ని జత చేశాడు. ఈ క్రమంలో అతను అర్థ శతకం కూడా నమోదు చేసుకున్నాడు. అయితే తుషార్ బౌలింగ్‌లో హెడ్(67) హెట్మైర్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 2 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఇషాన్(39), నితిష్(18) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News