ఐపిఎల్ లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్ తన సొంత మైదానం చెపాక్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడుతుంది. మొదట టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 19.5 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మహ్మద్ షమి వేసిన (0.1) మొదటి బాల్‌కే చెన్నై వికెట్ కొల్పోయింది. షమి బౌలింగ్‌లో స్లిప్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. దూకుడుగా ఆడుతున్న ఆయుష్ మాత్రే (30;19 బంతుల్లో 6 ఫోర్లు) కమిన్స్ బౌలింగ్‌లో (5.3) ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా(21; 17 బంతుల్లో 1 ఫోరు, 1 సిక్స్),హర్షల్ పటేల్ బౌలింగ్‌లో (12.5) బ్రెవిస్ (42;25 బంతుల్లో 1 ఫోరు, 4 సిక్స్ లు) కమిందు మెండిస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.శివమ్ దూబే (12), ధోనీ (6),దీపక్ హుడా(22) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 ,ప్యాట్ కమిన్స్ 2, జయదేవ్ ఉనద్కత్ 2, మహ్మద్ షమి 1, కమిందు మెండిస్ 1 వికెట్ తీసుకున్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 155
- Advertisement -
- Advertisement -
- Advertisement -