Monday, April 14, 2025

తేలిపోయిన సన్‌రైజర్స్..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: కిందటి ఐ పిఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అ సాధారణ ఆటతో చెలరేగి పోయిన సంగతి తెలిసిం దే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో హైదరాబాద్ అద్భుత ప్రతిభను కనబరిచింది. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ తదితరులు ఆకాశ మే హద్దుగా చెలరేగి పోయారు. 2024లో సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లో ఎన్నో రికార్డులను తిరిగరాసింది. కానీ ఈ సీజన్‌లో సీన్ పూ ర్తిగా మారిపోయింది. బ్యాటింగ్‌లో సన్‌రైజర్స్ పూర్తిగా తేలిపోతోంది. రాజస్థాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో తప్పిస్తే హైదరాబాద్ బ్యాటర్లు ఏ మ్యాచ్‌లోనూ సత్తా చాటలేక పోయారు.

తొలి మ్యాచ్‌లో సెంచరీతో అలరించిన ఇషాన్ కిషన్ ఆ తర్వాతి మ్యాచుల్లో పూర్తిగా నిరాశ పరిచాడు. వరుసగా మూడు మ్యాచుల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితయ్యాడు. అభిషేక్ శర్మ కూడా చెత్త బ్యాటింగ్‌తో సతమతమవుతున్నాడు. హెడ్ కూడా ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. హెన్రిచ్ క్లాసెస్ ఒక్కడే కాస్త మెరుగైన ఆటను కనబరుస్తున్నాడు. ఇక ఈ సీజన్‌లో ఇప్పటికే ఐదు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఇకపై జరిగే మ్యాచుల్లోనైనా హైదరాబాద్ బ్యాటర్లు రాణిస్తారా లేదా వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News