ఐపిఎల్‌లో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. మొదట టాస్ గెలిచిన లఖ్ నవూ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.ఈ మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ(6) శార్దూల్ ఠాకూర్ వేసిన 2.1 ఓవర్ కు నికోలస్ పూరన్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో వికెట్ కీపర్ పంతక్ క్యాచ్ ఇచ్చి డకౌట్ గా వెనుదిరిగాడు.వరుసగా రెండు వికెట్లు పడ్డా ట్రావిస్ హెడ్(47; 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్ లు) దూకుడుగా ఆడాడు. అనికేత్ వర్మ(36),నితీష్ కుమార్ రెడ్డి(32),అంకిత్ వర్మ(24) పరుగులు చేశారు. ఈ మ్యాచ్ లో లక్నో బౌలర్ శార్దూల్ ఠాకూర్ 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.
లక్నోసూపర్ జెయింట్స్ లక్ష్యం 191
- Advertisement -
- Advertisement -
- Advertisement -