Thursday, December 26, 2024

ముంబై ఇండియన్స్ తో తలపడనున్న సన్ రైజర్స్ హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

ముంబై: ఈ రోజు రాత్రి 7.30 గంటలకు వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనున్నాయి. గెలుపు అంచనా ప్రకారం ముంబై ఇండియన్స్ జట్టు గెలిచే అవకాశం కనిపిస్తోంది. వాంఖడే పిచ్ బ్యాట్స్ మెన్ లకు పెద్దగా సహకరించదు. పాయింట్స్ టేబుల్ లో ముంబై జట్టు ఆఖరున ఉండడమే కాదు, ప్లేఆఫ్ అవకాశాలను కూడా కోల్పోయింది. పైగా ఆ జట్టులోని స్టార్ ప్లేర్ లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ జట్టు తన పాయింట్లను పెంచుకోవాలంటే గెలవాల్సిందే.

ముంబయి జట్టు: హార్దిక్ పాండ్య(కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయిట్టీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారా.

హైదరాబాద్ జట్టు: పాట్ కమిన్స్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెస్(వికెట్ కీపర్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అన్మోల్ ప్రీత్ సింగ్, నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్, షహ్ బాజ్ అహ్మద్, మార్కో యన్ సెన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్.

ఆట ఎలా ఉండగలదో చూద్దాం !

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News