ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో విజయం నమోదు చేసింది. శుక్రవారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ 26, అజింక్య రహానె (35) పరుగులు చేశారు. ఇక శివమ్ దూబె మరోసారి విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న శివమ్ 24 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 45 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 4 ఫోర్లతో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
డారిల్ మిఛెల్ (13) పరుగులు సాధించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో కెప్టెన్ కమిన్స్, ఉనద్కట్, భువనేశ్వర్‌లు పొదుపుగా బౌలింగ్ చేశారు. తర్వాత లక్షఛేదనకు దిగిన హైదరాబాద్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు జట్టుకు శుభారంభం అందించారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శఱ్మ 12 బంతుల్లోనే 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. హెడ్ 3 ఫోర్లు, సిక్సర్‌తో 31 పరుగులు సాధించాడు. మరోవైపు అద్భుత ఇన్నింగ్స్ ఆడిన మార్‌క్రమ్ 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 పరుగులు చేశాడు. షాబాజ్ (18), క్లాసెన్ 10 (నాటౌట్), నితీష్ రెడ్డి 14 (నాటౌట్) మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు.