ఐపిఎల్‌లో భాగంగా బుధవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓపెనర్ రాహుల్ 29 పరుగులు చేశాడు. కృనాల్ పాండ్య రెండు సిక్సర్లతో 24 పరుగులు సాధించాడు. చివర్లలో నికోలస్ పూరన్ 26 బంతుల్లో 48 (నాటౌట్), అయూష్ బడోని 55 (నాటౌట్) చెలరేగి ఆడడంతో లక్నో మెరుగైన స్కోరును నమోదు చేసింది.
హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 9.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయారు. దూకుడగా ఆడిన హెడ్ 30 బంతుల్లోనే 8 సిక్సర్లు, 8 ఫోర్లతో 89, అభిషేక్ 28 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, 8 బౌండరీలతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. దీంతో మరో 62 బంతులు మిగిలివుండగానే మ్యాచ్‌ను సొంతం చేసుకుని నయా రికార్డు నెలకొల్పింది.