- Advertisement -
ఐపిఎల్‌లో భాగంగా గురువారం ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక పరుగు తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో చివరికి సన్‌రైజర్స్‌ను విజయం వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.
ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆరు ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. ధాటిగా ఆడిన నితీష్ రెడ్డి 42 బంతుల్లో 76, క్లాసెన్ 19 బంతుల్లోనే 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. యశస్వి (67), రియాన్ పరాగ్ (77) రాణించినా ఫలితం లేకుండా పోయింది.
- Advertisement -