హైదరాబాద్: గత ఐపిఎల్ సీజన్‌లో ఫైనల్స్ వరకూ వెళ్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్‌లో మాత్రం చెత్త ప్రదర్శన చేస్తోంది. ఈ సీజన్‌లో స్టార్ బ్యాటర్లు ఘోరంగా విఫలమవుతున్నారు. బౌలింగ్ విభాగం కూడా రాణించడం లేదు. దీంతో ఎనిమిది మ్యాచుల్లో కేవలం రెండు మ్యాచుల్లోనే విజయం సాధించింది హైదరాబాద్ జట్టు. అయితే స్వల్స రన్‌రేటు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ కంటే పాయింట్ల పట్టికలో ఒక స్థానం ముందు అంటే 9వ స్థానంలో ఉంది హైదరాబాద్.
అయితే ఆసక్తికరంగా తర్వాతి మ్యాచ్‌లో హైదరాబద్, చెన్నైతోనే తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి జట్టు రన్‌రేటు మెరుగుపడి.. తొమ్మిదో స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే సన్‌రైజర్స్ జట్టుకు ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు ఇంకా అవకాశం ఉంది. అది ఎలా అంటే.. ఇప్పటి నుంచి ఆడే అన్ని మ్యాచుల్లో జట్టు కచ్చితంగా విజయం సాధించాల్సిందే. అలా చేస్తే.. మ్యాజిక్ ఫిగర్ 16 పాయింట్లకు చేరే అవకాశం ఉంది. దీంతో ఫ్లే ఆఫ్స్‌కి వెళ్లోచ్చు. ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినా.. ప్లేఆఫ్స్ అవకాశం చేజారిపోతుంది. మరి సన్‌రైజర్స్ తిరిగి ఫామ్‌ని పుంజుకొని.. గెలుపు బాట పడుతుందా.. లేదా..? వేచి చూడాల్సిందే.