Tuesday, April 1, 2025

నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో సన్‌రైజర్స్

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: ఐపిఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ మొదటి ఓవర్‌లోనే అభిషేక్ వికెట్‌ను కోల్పోయింది. స్టార్క్ వేసిన ఈ ఓవర్‌లో అభిషేక్(1) రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత స్టార్క్ వేసిన మూడో ఓవర్‌లో ఇషాన్ కిషన్(2) స్టాబ్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా.. నితిశ్ రెడ్డి(0) అక్షర్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. స్టార్క్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికే హెడ్(22) కీపర్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. దీంతో 5 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 4 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజ్‌లో అనికేత్(6), క్లాసెన్(11) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News