లక్నో: ఐపిఎల్ సీజన్16లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. శుక్రవారం ఇక్కడి ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ఐదు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేసింది. ఆరంభం నుంచే లక్నో బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో హైదరాబాద్‌ను కట్టడి చేశారు. ఒపెనర్ మయాంక్ అగర్వాల్ 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే రాహుల్ త్రిపాఠితో కలిసి మరో ఓపెనర్ అన్మోల్‌ప్రీత్ సింగ్ కొద్ది సేపు పొరాటం చేశాడు. ధాటిగా ఆడిన అన్మోల్‌ప్రీత్ 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 31 పరుగులు చేశాడు. కెప్టెన్ మార్‌క్రమ్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌటయ్యాడు. హారిబ్రూక్ (3) కూడా నిరాశ పరిచాడు. రాహుల్ త్రిపాఠి (35), అబ్దుల్ సమద్ 21 (నాటౌట్), వాషింగ్టన్ (16) మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. లక్నో జట్టు బౌలర్లలో కృనాల్ పాండ్య మూడు, అమిత్ మిశ్రా రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లక్నో 16 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రాహుల్ (35), కృనాల్ పాండ్య (34) జట్టును ఆదుకున్నారు.