- Advertisement -
విశాఖపట్నం: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా వైఎస్‌ఆర్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో లక్నోతో ఓడిపోయిన సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇక అదే లక్నో జట్టుపై ఘన విజయం సాధించిన ఢిల్లీ జట్టు అదే జోష్‌ని ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తమ టీంలో చెరో మార్పు చేశాయి. సన్‌రైజర్స్ జట్టులో సిమర్‌జీత్ స్థానంలో జీషాన్ జట్టులోకి రాగా.. ఢిల్లీ జట్టులో సమీర్ రిజ్వి స్థానంలో కెఎల్ రాహుల్ జట్టులోకి వచ్చాడు.
- Advertisement -