- Advertisement -
హైదరాబాద్: ఎండలపైన ఐఎండి ఇచ్చిన హెచ్చరికలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఉదయం 12 గంటలు నుంచి 4 గంటలకు తప్పనిసరి పరిస్థితి అయితేనే బయటకు వెళ్ళాలని సూచించారు. బయటకు వెళ్ళాల్సి వస్తే తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. అన్ని ప్రాధమిక కేంద్రాలు,అంగన్వాడీ ,సబ్ సెంటర్స్ లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఎవరికైనా ఎండ ఎఫెక్ట్ అయితే, వెంటనే వైద్యలను సంప్రదించాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో సిఎస్ సోమేశ్ కుమార్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించి, తగు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే.
- Advertisement -