Thursday, January 23, 2025

ఫెస్టివ్ కలెక్షన్ 2023 కోసం సన్ సెట్ కలర్స్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అన్ని అంశాలలో మెరుపు, ప్రకాశంతో కూడిన వ్యక్తిగతీకరించిన ప్రత్యేక కలెక్షన్ తో వేడుకల సీజన్‌కు సాదరంగా హెచ్&ఎం ఇండియా మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. పార్టీకి సిద్ధంగా ఉన్న వస్త్రాలతో కూడిన ఈ కలెక్షన్ బలమైన భుజాలు, క్రాప్డ్ టాప్‌లు, స్టేట్‌మెంట్ సూటింగ్, పార్టీ డ్రెస్‌లు, మ్యాచింగ్ సెట్‌ల మధ్య వస్త్రాలలోని సూక్ష్మ వివరాలను ఈ డిజైన్‌లు ప్రదర్శిస్తాయి. రైన్‌స్టోన్‌లు, సీక్విన్స్, హై-షైన్ ఫ్యాబ్రిక్‌లు ప్రతి వస్త్రానికి అధునాతనతను, చైతన్యాన్ని తీసుకువస్తాయి, అయితే హాట్ పింక్, నారింజ, ఎరుపు, ఇసుక, బంగారం, నలుపు రంగులతో కూడిన కలర్ పాలెట్ వేడుకల ధోరణికి మరింత ఆనందం జోడిస్తుంది.

పండుగ కలెక్షన్ కోసం, సీజన్ యొక్క అందం, ఉల్లాసాన్ని వెల్లడిస్తూ ఒక ప్రత్యేక కలెక్షన్ ను రూపొందించాలని హెచ్&ఎం కోరుకుంది. వెయిస్ట్ లైన్ వెంబడి, షోల్డర్ లైన్స్, శరీరం అంతటా డ్రేప్ చేయడం స్త్రీ రూపానికి ప్రాధాన్యతనిస్తుంది, అయితే పొడవాటి ప్యాంటు, స్కర్టులు ఆకట్టుకునే క్రాప్డ్ టాప్‌లతో మరింత ఆకర్షణ జోడిస్తుంది. టోనల్ లుక్స్ చాలా ముఖ్యమైనవి, కానీ విభిన్నమైన ఫ్యాబ్రిక్‌లు, అలంకారాలు దానిని సరదాగా, ఆధునికంగా మారుస్తాయి.

“ఈ ఫెస్టివ్ కలెక్షన్ సంవత్సరంలో చాలా ప్రత్యేకమైన సమయంలో వస్తుంది, మేము ఈ కలెక్షన్‌ పట్ల చాలా ఆసక్తిగా ఉన్నాము. మేము కాంతి యొక్క ప్రాముఖ్యత – కొవ్వొత్తులు, లాంతర్లు, బాణసంచాతో నిజంగా ప్రేరణ పొందాము. దానిని స్పష్టమైన సూర్యాస్తమయ రంగుల( సన్ సెట్ కలర్ ) పాలెట్‌గా మార్చాము, దానితో పాటుగా సీక్విన్స్, రైన్‌స్టోన్‌లు, శాటిన్‌లను కూడా తీసుకువచ్చాము. ఈ కలెక్షన్ మెరుపు, ప్రకాశంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రతి ఒక్కరినీ తమ పార్టీ లుక్ లో చూడటానికి మేము వేచి ఉండలేము!” అని హెచ్&ఎం లో కాన్సెప్ట్ డిజైనర్ ఎలియానా మస్గలోస్ చెప్పారు.

నటి అథియా శెట్టి నటించిన, అధునాతనమైన, సంతోషకరమైన ప్రచారంతో కలెక్షన్ యొక్క ప్రకాశాన్ని హెచ్&ఎం ఇండియా బయటకు తీసుకొచ్చింది. బంగారు ఎంబ్రాయిడరీ ప్యాంటు, క్రాప్డ్ ట్యాంక్ సెట్‌ను ధరించి, అథియా, మోడల్స్ అంజలి టోర్వి, ఆష్లే రాడ్జారామే, జిన్నియా కుమార్‌లు నిర్మాణాత్మక కాలమ్స్, కప్పబడిన పైకప్పులతో కూడిన అందమైన ప్యాలెస్ సెట్టింగ్‌లో చూడవచ్చు. ప్రఖ్యాత ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ గ్రెగొరీ హారిస్ ద్వారా చిత్రీకరించబడిన ఈ ప్రచారం వీక్షకులను స్పష్టమైన రంగులు, మెరుపు, ఆనందంతో కూడిన ఈ ఫెస్టివ్ కలెక్షన్ ప్రపంచంలోకి ఆహ్వానిస్తుంది.

“హెచ్&ఎం ద్వారా ఈ ఫెస్టివ్ కలెక్షన్‌లో భాగమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.  నేను మొదటిసారి చూసినప్పుడే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను! షూటింగ్ మొత్తం కూడా ఆనందంగా సాగింది. సెట్‌లో, స్టూడియోలో అద్భుతమైన టీమ్‌తో కలిసి పని చేయడం వల్ల పండుగ ఆనందం, వేడుక నిజంగా వచ్చింది. మేము అందరమూ చాలా వినోదం పొందాము!” అని అథియా శెట్టి చెప్పారు.

ఈ ఫెస్టివ్ కలెక్షన్‌లోని ప్రధాన భాగాలలో టై-అప్ వివరాలతో కూడిన ఎరుపు రంగు ట్రౌజర్ సూట్, అసమానమైన నెక్‌లైన్‌లతో కూడిన దుస్తులు, ఆల్-ఓవర్ సీక్విన్డ్ టాప్స్, బ్లేజర్, డ్రెస్‌లు ఉన్నాయి. షైన్, షిమ్మర్, గ్లామ్ పెద్ద, బోల్డ్ ఆభరణాలు, బిజౌ బ్యాగ్‌లు, స్ట్రాపీ షూస్, పాయింటెడ్ ఫ్లాట్‌ల శ్రేణికి కూడా విస్తరిస్తుంది. టాప్‌లు INR 1499 నుండి ప్రారంభమవుతాయి. యాక్సెసరీలు INR 799 నుండి ప్రారంభమవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News