Thursday, January 23, 2025

12కు చేరిన వడదెబ్బ మృతుల సంఖ్య..

- Advertisement -
- Advertisement -

థానే: మహారాష్ట్రలో ఓ పురస్కార కార్యక్రమంలో ఎండవేడిమి తాళలేక మృతిచెందినవారి సంఖ్య 12కు చేరిందని అధికారులు సోమవారం తెలిపారు. నవీ ముంబయిలో జరిగిన ఓ అవార్డు కార్యక్రమానికి వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 12మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కల్యాణ్‌కు చెందిన 55ఏళ్ల వ్యక్తి ఆరోగ్యం విషమించడంతో ప్రాణాలు కోల్పోయాడు.

Also Read: సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని రెండు వారాలు పొడిగించిన ఢిల్లీ కోర్టు

మరో ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉందనిప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ తెలిపారు. కాగా ఆదివారం జరిగిన భూషణ్’ కార్యక్రమానికి భారీసంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. వీరిలో 11మంది ఆదివారం వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో మరో వ్యక్తి సోమవారం మృతిచెందడంతో మృతుల సంఖ్య 12కు చేరింది. చనిపోయినవారిలో ఎనిమిది మంది మహిళలు, నలుగురు పురుషులుగా అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News