కూరగాయల ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతుంటారు. కానీ ఆ కూరగాయల ఆహారం వల్ల ప్రతికూల పరిణామాలు కూడా ఏర్పడుతున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. కూరగాయల ఆహారం చినపేగులో గల బ్యాక్టీరియాకు మందులను ప్రతిఘటించే శక్తిని కలిగిస్తుందని అధ్యయనంలో తేలింది. మందులను ప్రతిఘటించడం వల్ల వచ్చే వ్యాధులు ప్రజారోగ్యానికి , ఆహార భద్రతకు ముప్పు కలిగించడమే కాకుండా ఆర్థిక భారం కూడా కలిగిస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఈ వ్యాధుల సంక్రమణను నివారించే ముందు మందులను ప్రతిఘటించే బ్యాక్టీరియా, వాటి జన్యువులు ఆహారం నుంచి ఎలా సంక్రమిస్తున్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. మొక్కలకు చెందిన ఆహారం పేగు లోని బ్యాక్టీరియాకు మందులను ప్రతిఘటించే శక్తిని ఏ విధంగా రవాణా చేస్తుందో పరిశోధకులు ఇప్పుడు నిరూపిస్తున్నారు. పరిశుభ్రం లేని కూరగాయలను ఆహారంగా తీసుకున్న వెంటనే డయేరియా సోకి మొక్కల నుంచి సూపర్ బగ్స్‌ను మనుషులకు వ్యాపింప చేస్తాయని పరిశోధకులు వివరించారు.
సూపర్‌బగ్స్ మన పేగుల్లో వ్యాధికారకాలుగా నెలలు, సంవత్సరాల పాటు దాగి ఉంటాయి. చిన్నపేగుల్లోంచి ఎప్పుడైతే తప్పించుకుంటాయో అప్పుడు వ్యాధులను అంటే మూత్ర వ్యాధి వంటి వాటిని సంక్రమింప చేస్తాయి. దీన్ని నిరూపించడానికి పరిశోధకులు నవీన పద్ధతిని కనుగొన్నారు. దీన్ని లెట్యూస్ మౌస్ మోడల్ అని అంటారు. కూరగాయల ఆహారంతోపాటు సూపర్‌బగ్స్‌ను ఆరగించే అనుకరణ పద్ధతిని ప్రవేశ పెట్టారు.
దీనివల్ల తక్షణం ఎలాంటి అస్వస్థత కలగదు. పరిశోధకులు లెట్యూస్‌ను ప్రయోగాత్మకంగా పెంచారు. మందులను ప్రతిఘటించే ఈ కోలి బ్యాక్టీరియాపై లెట్యూస్ ప్రయోగించారు. దాన్ని ఎలుకలకు తినిపించి ఎలుక మలాన్ని చాలా సేపు విశ్లేషించారు. ఆహారం జీర్ణమైన తరువాత పేగులో బ్యాక్టీరియా విభిన్న సామర్ధంతో నిశ్శబ్దంగా తిష్ట వేయడాన్ని గమనించారు. ఆశ్రయించిన ఆశ్రయాన్ని బట్టి బ్యాక్టీరియా రకాల బట్టి ఇది ఆధారపడి ఉంటోంది. యాంటీ బయోటిక్, యాంటాసిడ్ ట్రీట్‌మెంట్లను ఈ సందర్భంగా అనుకరింప చేశారు. ఈ రెండూ సూపర్‌బగ్స్ పొట్ట నుంచి చినపేగులకు రవాణా సాగేలా సామర్ధంపై ప్రభావం చూపించాయని పరిశోధకులు వివరించారు.