- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కు సూపర్ సైక్లోన్ ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాలు కురవడంతో భయంకరమైన వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నెల 18న ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఈ నెల 20 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్ వైపు పయనస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ తర్వాత తుఫాన్ గా మారనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. తుఫాన్ ఏర్పడితే సిత్రాంగ్ గా నామకరణం చేసే అవకాశం ఉంది. సూపర్ సైక్లోన్ అవకాశాలను గ్లోబల్ ఫోర్ కాస్ట్ సిస్టమ్ గుర్తించింది. సూపర్ సైక్లోన్ ఏర్పడితే ఎపి, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలపై ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు.
- Advertisement -