Monday, January 20, 2025

సన్నాలకే సై

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగం లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పంట ల సరళిపై రైతాంగంలో అవగాహణ పెరుగుతూ వస్తోంది. ప్రత్యేకించి వరిసాగులో ఈ ఖరీఫ్ నుం చే భారీ మార్పులు జరగనున్నాయి. మార్కెట్‌లో సన్నబియ్యానికి పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పె ట్టుకుని రైతులు వరిసాగులో సన్నరకాలకు జై కొట్టబోతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం కూడా సన్నరకం వరిసాగు దిశగా రైతులను ప్రోత్సహిస్తుండటంతో తెలంగాణ మాగాణం సన్నాల మయం కా బోతోంది. రాష్ట్రంలో వానాకాలం సీజన్ కింద అ న్ని రకాల పంటలు కలిపి కోటి26లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగులోకి రానున్నాయి.
అయితే అందులో 50శాతంపైగా విస్త్తీర్ణం వరిసాగుతోనే నిం డిపోతోంది. రాష్ట్రంలో సాగునీటి వనరుల లభ్యత పెరగటం, అధునాతన సాంకేతిక విజ్ణానం , శాస్త్రవేత్తల పరిశోధనల్లో చీడపీడలను తట్టుకుని అధి క దిగుబడులను అందించే కొత్తరకం వంగడాలు రూపుదిద్దుకుంటుండం వంటి వాటివల్ల వరిసాగు విస్తీర్ణం కూడా అదే ఊపులో పెరుగుతూ వస్తోం ది.

తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదుల పరివాహకంగా ఏటా ఖరీఫ్‌లో 62లక్షల ఎకరాల నుంచి గరిష్టంగా 65లక్షల ఎకరాల విస్తీర్ణం మేరకు వరిసాగు జరుగుతోంది. అందులో అత్యధిక శాతం దొడ్డుబియ్యం రకాలే సాగులోకి వస్తున్నాయి. డొడ్డు రకం వరిలో చీడపీడల సమస్య త క్కువ అన్న భావనతోపాటు పంట దిగుబడికూడా సన్న రకాల వరి కంటే రెండు మూడు క్వింటాళ్లు అధికంగా వస్తుందన్న నమ్మకమే రైతులను ఇంతకాలందొడ్డుబియ్యంసాగు చుట్టు తిప్పుతూ వచ్చింది. వరిసాగులో 80శాతం డొడ్డు రకాలు ఆక్రమించగా ,కేవలం 20శాతం మాత్రమే సన్నరకం వరిసాగు పరిమితమవుతూ వస్తోంది.2021 నుంచి దొడ్డు రకాల వరి మరింత పెరుగుతూ వస్తోంది. 2021వానాకాలం 62.13లక్షల ఎకరాల్లో వరి సాగు జరగ్గా, 2022 వానకాలంలో ఇది 64.54 లక్షల ఎకరాలకు పెరిగింది. 2023వానాకాలం సీజన్‌లో రికార్డు స్థాయిలో 65లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. అయితే ఇందులో 80శాతం సన్నరకం వరిసాగు జరిగింది.సన్నరకం బియ్యానికి గత రెండేళ్లుగా మార్కెట్‌లో డిమాండ్ పెరుగు తూ వస్తోంది. అన్ని వర్గాల ప్రజలు సన్నరకం బి య్యాన్నే తమ ఆహారంగా ఎంచుకుంటున్నారు. దీంతో మార్కెట్‌లో సన్నరకం బియ్యం ధరలు చు క్కులు తాకుతున్నాయి. కిలో బియ్యం 55 నుంచి 60రూపాలు పలుకుతోంది.

దీంట్లో కూడా సూపర్‌ఫైన్ రకాలు ఈ ఏడాది రూ.70కి చేరాయి.రాష్ట్రంలో సన్నరకం వరిసాగు తగ్గిపోవటం , రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా సన్నరకం బియ్యం లభ్యత తగినంత లేకపోవటంతో వ్యాపారులు బయటి రాష్ట్రాలనుంచి సన్నబియ్యం దిగుమతి చేసుకుని మార్కెట్లో విక్రయిస్తున్నారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ గురుకుల పాఠశాలలకు , హాస్టళ్లకు , అంగన్‌వాడీ కేంద్రాలకు సన్నబియ్యమే అందజేస్తోంది. రాష్ట్ర పరిధిలో సన్నబియ్యం కొరతతో బయటినుంచి దిగుమతి చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం ఏటా రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దుతు ధరలకు సేకరించి సిఎంఆర్‌కింద మిల్లులకు పంపిణీ చేస్తోంది. ఇందులో కూడా 98శాతం డొడ్డురకాల ధాన్యమే అక్రమిస్తోంది. సన్నరకం ధాన్యం 2శాతం కూడా మించటం లేదు. డొడ్డు రకం ధాన్యం సిఎంఆర్‌కింద రాష్ట్ర ప్రభుత్వం భారత ఆహార సంస్థకు అందజేస్తుండగా తిరిగి అదే దొడ్డుబియ్యం ఎఫ్‌సిఐ రాష్ట్రాలకు కేటాయిస్తుంది. డొడ్డుబియ్య రేషన్ షాపుల ద్వారా 24లక్షల మెట్రిక్ టన్నుల మేరకు లబ్ధిదారులకు అందజేస్తున్నా వాటిని ఆహారంగా తినే వారి సంఖ్య నానాటికి తగ్గుతూ వస్తోంది. తెరచాటుగా రేషన్‌బియ్యం కిలో రూ.10కు విక్రయిస్తున్నారు. అదే బియ్యం పాలిష్‌ద్వారా సన్నబియ్యంరూపం దాల్చి 60శాతం మార్కెట్‌కు చేరుతోంది. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

సన్నరకం ధాన్యానికి రూ.700 అధిక ధర:
సన్నరకం ధాన్యానికి మార్కెట్‌లో క్వింటాలుకు రూ.700 అదనంగా ధరలభిస్తోంది. సరకు నాణ్యతను బట్టి ఈ సారి క్వింటాలు సన్నరకం ధాన్యం రైతులనుంచి రూ.3000 కూడా పెట్టి వ్యాపారులు పోటీలు పడి కొనుగోలు చేశారు. తేమ తరుగు వంటి సమస్యలు లేకుడా వ్యాపారులు రైతుల పొలాల వద్దే సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేయటం వల్ల రైతుకుల మరిత లాభం చేకూరింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాలకు సాధారణ రకానికి రూ.2183, ఏ గ్రేడ్ రకానికి రూ.2203 ప్రకటించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం అయినా డొడ్డురకం అయినా ధరలో పెద్ద వ్యత్యాసం లేకపోవటం, తేమ తాలు వంటి సమస్యలతో రైతులు డొడ్డురకం ధాన్యం విక్రయాల్లో సమస్యలను ఎదుర్కొవాల్సివస్తోంది. సన్నరకం ధాన్యం పండించిన రైతులు సులువుగా విక్రయించటంతోపాటు, లాభసాటి ధరలను పొందగలుగుతున్నారు.

సన్నరకాలకు అనుకూల వాతావరణం:
రాష్ట్రంలో సన్నరకాల వరిసాగుకు అన్ని విధాల అనుకూలమైన వాతావరణం ఉందని శాస్త్రవేత్తులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా సన్నరకాల సాగును ప్రోత్సహించేందుకు ప్రాంతాలు , జిల్లాల వారీగా సాగు ప్రణాళికలను రూపొందిస్తొంది. సన్నరకం వరి ధాన్యం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బియ్యం ఎగుమతులకు ఉన్న అవకాశాలనుకూడా రైతులు సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ప్రణాళిలు సిద్దం చేస్తోంది. సన్నరకం వరిసాగులో పంటకాలం 115రోజుల నుంచి 125రోజుల్లోనే పూర్తికావటం కూడా అనుకూలంగా ఉంటుందని సూచిస్తున్నారు. సన్నరకాల్లో డబ్యుజిఎల్ 1119, 1487,సిద్ది, వరంగల్ 2, డబ్యుజిఎల్ 1246 వంటి విత్తన రకాలను కూడా రైతులకు అందుబాటులోకి తెస్తున్నారు. బిపిటి 5204,డబ్యుజిఎల్ 44, 362, తదితర 19 సన్నవరి విత్తన రకాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News