Thursday, January 23, 2025

ప్రయాణికుల ఆదరణకు సూపర్ సేవర్ మెట్రో హాలీడే కార్డు

- Advertisement -
- Advertisement -

సెలవుల్లో అపరిమిత ప్రయాణ అవకాశాలను అందిస్తున్న మెట్రో రైల్
ఉగాది పండగ నుంచి మెట్రో రైల్ టిక్కెట్ కౌంటర్ల వద్ద విక్రయాలకు లభ్యం
అపరిమిత ప్రయాణం కేవలం 59 రూపాయలతో
సెలవు దినాలలో నిర్వహణ సమయమంతటా అపరిమిత మెట్రో ప్రయాణ అవకాశం


మన తెలంగాణ,సిటీబ్యూరో: ఈ ఉగాది పండగతో ప్రారంభించి ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్ నగరవాసుల సెలవుల సంతోషాన్ని తమ విన్నూతమైన సూపర్ సేవర్ మెట్రో హాలీడే కార్డ్ ద్వారా విస్తరిస్తోంది. ఈకార్డుతో హైదరాబాద్‌లో 57 మెట్రో స్టేషన్‌ల మధ్య ఒక రోజులో అపరిమితమైన సార్లు తిరగవచ్చు. సంవత్సరంలో వర్తించేటటువంటి 100 సెలవు దినాలలో మాత్రమే ఈకార్డు అందుబాటులో ఉంటుంది. ఈసూపర్ సేవర్ మెట్రో హాలీడ్ కార్డునే గురువారం ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ, సీఈవో కెవీబీరెడ్డి అమీర్‌పేట మెట్రో స్టేషన్ ప్రాంగణంలో ప్రయాణీకులు, మెట్రో అధికారులు సమక్షంలో విడుదల చేశారు. ఈసూపర్ సేవర్ మెట్రో హాలీడే కార్డు ఏప్రిల్ 02 నుంచి అందుబాటులో ఉంటుంది.

మెట్రో రైల్ ప్రయాణీకులు ఎవరైనా సరే ఒకసారి తిరిగి చెల్లించబడనటువంటి 50 రూపాయలతో పాటు 59 రూపాయలను టాపప్ విలువ చెల్లించడం ద్వారా ఈకార్డు పొందవచ్చు. ఈ టాపప్ విలువ కేవలం వర్తించేటటువంటి సెలవు దినాలకు మాత్రమే పరిమితం. ఆరోజు మాత్రమే దానిని వాడుకోవాల్సి ఉంటుంది. ఈసందర్భంగా హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ సేవర్ మెట్రో హాలీడే కార్డును మాప్రయాణికులకు అందించడాన్ని మించిన ఆఫర్ ఏముంటుంది.

ఈతరహా ఆఫర్‌లు నగర ప్రయాణాలకు మరింత అధికంగా మెట్రో వినియోగించేందుకు స్పూర్తి కలిగిస్తాయన్నారు. అనంతరం కెవిబీరెడ్డి వివరిస్తూ అత్యంత శుభప్రదమైన ఉగాది రోజు నుంచి మా ప్రయాణీకులకు పూర్తి అందుబాటులో ఉండే సూపర్ సేవర్ మెట్రో హాలీడే కార్డు విడుదల చేయడం సంతోషంగా ఉన్నాం. నామమాత్రపు రీచార్జ్‌తో జాబితాకరించిన సెలవు రోజుల్లో 59 రూపాయలకే ప్రయాణం చేయవచ్చన్నారు. మా ప్రయాణీకులకు అత్యుత్తమ శ్రేణి ప్రయాణ అవకాశాలను అందించడానికి కట్టుబడి ఉన్నామనే మా నిబద్దతను ఇది పునరుద్ఘాటిస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News