Tuesday, April 29, 2025

కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాకు మహేశ్ బాబు కాంప్లిమెంట్!

- Advertisement -
- Advertisement -

 

MaheshBabu On Vikram movie

హైదరాబాద్: కమల్ హాసన్ నటించిన, విజయవంతంగా నడుస్తున్న ‘విక్రమ్’ సినిమాపై తెలుగు సూపర్ స్టార్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇప్పటి సినిమాల్లో ‘న్యూ ఏజ్‌ కల్ట్‌ క్లాసిక్‌ మూవీ’గా అభివర్ణించాడు. ‘‘విక్రమ్‌ బ్లాక్‌బస్టర్ సినిమా. ఒక న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ చిత్రం. లోకేశ్ కనకరాజ్.. నేను మిమ్మల్ని కలిసి విక్రమ్‌ మూవీ ప్రారంభం నుంచి చివరి వరకు షూటింగ్ ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఉంది. విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్ తమ అద్భుతమైన నటనతో మెరిపించేశారు. అనిరుధ్‌ బెస్ట్ మ్యూజిక్ అందించాడు. చాలాకాలం తర్వాత నా ప్లే లిస్ట్‌ టాప్‌లో విక్రమ్‌ ఉంది. ఇక చివరిగా లెజెండ్‌ కమల్‌ హాసన్‌ నటన గురించి చెప్పేందుకు నాకు అర్హత లేదు. ఒక అభిమానిగా చాలా గర్వంగా ఉంది.  మీకు, మీ అద్భుతమైన బృందానికి శుభాకాంక్షలు’’ అని మహేశ్‌ బాబు ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News