Wednesday, January 22, 2025

‘కల్కి’ సినిమాను ప్రశంసించిన రజనీకాంత్

- Advertisement -
- Advertisement -

చెన్నై: దర్శకుడు నాగ్ అశ్విన్, నటుడు ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘కల్కి 2898 ఏడి’ సినిమా తొలి రెండు రోజుల్లోనే బాక్సాఫీసును కుమ్మేసింది. చూసిన ప్రేక్షకుల స్పందన మామూలుగా లేదు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం సినిమా చూసి మెచ్చుకున్నారు. భారతీయ సినిమాను మరో మెట్టు ఎక్కించిన సినిమాగా అభివర్ణించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్ కు సెల్యూట్ చేశారు.

రజనీకాంత్ ‘ఎక్స్’ వేదికగా తన పోస్ట్ పెట్టారు. చిత్రం యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. కల్కి సినిమా చూశానని, సినిమా ఎంతో అద్భుతంగా ఉందన్నారు. నాగ్ అశ్విన్ భారతీయ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లారన్నారు.  చిత్రం భారీ విజయం సాధించినందుకు నిర్మాత అశ్విన్ దత్, నటులు అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణె సహా చిత్ర బృందం యావత్తును అభినందించారు. పైగా చిత్రం సెకండ్ కోసం ఎదురుచూస్తున్నానన్నారు.

దీనికి స్పందించిన ప్రభాస్ కూడా రిప్లయ్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News