Wednesday, January 22, 2025

విజయ్ కాంత్ మృతదేహం వద్ద వలవలా ఏడ్చిన సూపర్ స్టార్

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటుడు, డిఎండికె పార్టీ అధినేత విజయ్ కాంత్ (71) మృతి ఎందరినో తల్లడిల్లేలా చేసింది. కోలీవుడ్ కు చెందిన పలువురు నటీనటులు విజయ్ కాంత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

కోయంబేడులోని డిఎండికె పార్టీ కార్యాలయంలో ఉంచిన విజయ్ కాంత్ మృతదేహాన్ని సందర్శించేందుకు సూపర్ స్టార్ విజయ్ వచ్చాడు. వచ్చీరాగానే తనను తాను నియంత్రించుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. విజయ్ నటించిన మొట్టమొదటి సినిమా వెట్రి. ఈ సినిమాలో హీరో విజయ్ కాంత్. అప్పటినుంచీ ఈ ఇద్దరి మధ్య అనుబంధం కొనసాగుతోంది. ఈ సినిమాకు విజయ్ తండ్రి ఎస్ఎ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News